• English
  • Login / Register

2015 టోక్యో మోటార్ షో లైవ్: తెర ముందుకు వచ్చిన డాట్సన్ గో క్రాస్ కాన్సెప్ట్!

డాట్సన్ గో కోసం raunak ద్వారా అక్టోబర్ 30, 2015 04:57 pm ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టోక్యో :

డాట్సన్ అధికారికంగా 2015 టోక్యో మోటార్ షోలో డాట్సన్ గో-క్రాస్ కాన్సెప్ట్ రూపంలో వారి మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్యువి / క్రాస్ఓవర్ ని వెల్లడించింది. 2016 లో భారత ఆటో ఎక్స్పో లో బహిర్గతం అవుతుందని ఆశిస్తున్నారు.

కొనసాగుతున్న టోక్యో మోటార్ షోలో డాట్సన్ అధికారికంగా వారి మొదటి క్రాస్ఓవర్ కాన్సెప్ట్  GO- క్రాస్ ని వెళ్ళడించింది. జపాన్ లో ఇది విడుదలయినప్పటికీ  ఈ వాహనం ఇతర ఆసియా దేశాలతో పాటు,  భారతదేశం లో కూడా ప్రారంభించబడుతుంది. ఇది  GO+ పైన ఆధారపడిన వాహనం. దీని ప్రారంభం రాబోయే 2016 ఫిబ్రవరి లో  ఉంటుందని  ఊహిస్తున్నారు. మొదటి దాని ధరలు గురించి మాట్లాడుకుంటే, GO మరియు  GO+ కంటే కొద్దిగా ఖరీదైనదిగా చెప్పవచ్చు.   

డాట్సన్ ఈనాటికీ దాని  క్రాస్ఓవర్ వివరాలను అందించలేదు. అయితే, ఇది ఒక క్రొత్త ముఖం మరియు నేర్పుగా మార్చబడిన వెనుక భాగంతో ఇది గో+ వెర్షన్  కి  దగ్గరగా అనిపిస్తుంది. ప్రక్క ప్రొఫైల్ మాత్రమే  GO+ వెర్షన్ ని గుర్తుకు తెస్తుంది. అదే తరహాలో, హోండా  సంస్థ  రాబోయే బిఆర్-వి (మొబిలియో ఆధారంగా కాంపాక్ట్ క్రాస్ఓవర్ / ఎస్యువి) ని అందిస్తుంది.     

ముందుగా ముఖభాగంతో మొదలుపెడితే, ఇది ముందు ఫేస్లిఫ్ట్ స్కోడా ఏతి లో ఉన్నటువంటి ట్విన్ హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉంది. ఈ కారు డాట్సన్ ట్రాపెజోయిడల్  గ్రిల్ ని కలిగి ఉంది. ముందు మరియు వెనుక బంపర్లు రెండూ కూడా డ్యూయల్-టోన్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు కలిగి ఉంది మరియు కాన్సెప్ట్ కూడా స్పోర్ట్స్ శరీర క్లాడింగ్ తో ఉంది. అంతేకాక, అది ఒక క్రాస్ఓవర్ కనుక దీని గ్రౌండ్  క్లియరెన్స్ గో/గో+ కంటే ఎక్కువగా ఉంది. కాన్సెప్ట్ వెర్షన్ కూడా గ్రౌండ్ కంటే ఎత్తుగా ఉంది. దీని వీల్స్ కూడా 13 అంగుళాలు ఉండి, గో మరియు గో+ కంటే ఎక్కువగా ఉంటుంది. యాంత్రికంగా, ఈ వాహనం  1.2 లీటర్ 3-సిలిండర్ మోటార్ ని గో నుండి తీసుకోవచ్చు లేదా పూర్తిగా కొత్త ఇంజిన్లతో అమర్చబడి ఉండవచ్చని ఊహిస్తున్నాము. అది రెనాల్ట్-నిస్సాన్ యొక్క 1.5 లీటర్ dCi డీజిల్ ఇంజన్ ని తీసుకొనే అవకాశం కూడా ఉంది.           

కొత్త మోడల్ తో పాటుగా, డాట్సన్ కూడా  2014 భారత ఆటో ఎక్స్పోలో రెడీ గో కాన్సెప్ట్ ని బహిర్గతం చేసింది. రెనాల్ట్ క్విడ్ యొక్క విడుదల సమయంలో  రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ సిఇఒ  కార్లోస్ ఘోసన్, రెడీ గో భారతదేశంలో తదుపరి సంవత్సరం 2016 లో విడుదల చేయబడుతుందని తెలిపారు. ఉత్పత్తి వెర్షన్ రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం అవుతుందని ఆశిస్తున్నారు.

యాంత్రికంగా, రెడీ గో వాహనం రెనాల్ట్ క్విడ్ లో ఉన్నటువంటి అదే 800cc ఇంజిన్ తో అమర్చబడి ఉంటుందని అంచనా. ఆ ఇంజిన్  5678rpm వద్ద 54ps శక్తిని మరియు 4386rpm వద్ద 72Nm టార్క్ ని అందిస్తుంది మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. రెనాల్ట్ సంస్థ త్వరలో క్విడ్ వాహనానికి ఏఎంటి ట్రాన్స్మిషన్ వ్యవస్థను అందించబోతున్నది. అలాగే రెడీ గో కూడా అదే ఏఎంటి ట్రాన్స్మిషన్ వ్యవస్థను పొందవచ్చని ఊహిస్తున్నారు.

was this article helpful ?

Write your Comment on Datsun గో

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience